సినీ ప‌రిశ్ర‌మలో మ‌రో విషాదం.. సీనియ‌ర్ న‌టుడు, ద‌ర్శ‌క నిర్మాత క‌న్నుమూత‌

Veteran actor Ramesh Deo dies aged 93.సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2022 2:18 PM IST
సినీ ప‌రిశ్ర‌మలో మ‌రో విషాదం.. సీనియ‌ర్ న‌టుడు, ద‌ర్శ‌క నిర్మాత క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రమేశ్ డియో క‌న్నుమూశారు. బుధ‌వారం సాయంత్రం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్ప‌త్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన‌ట్లు రమేశ్ డియో కుమారుడు ద‌ర్శ‌కుడు అభిన‌య్ దేవ్ వెల్ల‌డించారు. ఆయ‌న వ‌య‌స్సు 93 సంవ‌త్స‌రాలు. నాలుగు రోజుల క్రిత‌మే(జ‌న‌వ‌రి 30న‌) ఆయ‌న‌ పుట్టిన రోజును జ‌రుపుకోవ‌డంగ‌మ‌నార్హం. ఆయ‌న మృతి ప‌ట్ల సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు న‌టీన‌టులు సంతాపం తెలిపారు.

1926 జనవరి 30న మ‌హారాష్ట్రలోని అమరావతిలో రమేశ్ డియో జ‌న్మించారు. 1962లో 'ఆర్తీ' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయ‌న దాదాపు ఆరు ద‌శాబ్దాల పాటు న‌టించారు. త‌న సినీ కెరీర్‌లో 250పైగా హిందీ, దాదాపు 200 మ‌రాఠీ చిత్రాల్లో న‌టించారు. 'ఆనంద్', 'మేరే అప్నే', 'ఆప్ కీ కసమ్', డ్రీమ్ గర్ల్', 'జాలీ ఎల్.ఎల్.బి.', 'ఘాయల్ వన్స్ ఎగైన్ వంటి చిత్రాలు ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా ప‌లు చిత్రాల‌ను తెర‌కెక్కించారు.

రమేశ్ డియో భార్య సీమ కూడా ఓ న‌టినే. వీరికి ఇద్ద‌రు కుమారులు. ఓ కుమారుడు అజింక్యా.. హిందీ, మరాఠీ చిత్రాలలో పేరున్న నటుడు కాగా.. వీరి మరో కుమారుడు అభినయ్ 'ఢిల్లీ బెల్లీ, ఫోర్స్ -2' చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Next Story