దేశభక్తి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటుడు కన్నుమూత
భరత్ కుమార్ గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ (87) ముంబైలో మరణించారు.
By Knakam Karthik
దేశభక్తి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటుడు కన్నుమూత
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్ కుమార్ (87) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో మరణించారు. మనోజ్ కుమార్ దేశభక్తి చిత్రాలకు ప్రసిద్ధి చెందారు. ఆయన హిట్ చిత్రాలలో 'పురబ్ ఔర్ పశ్చిమ్, 'క్రాంతి', 'రోటీ కపడ ఔర్ మకాన్' ఉన్నాయి. మనోజ్ కుమార్ తన దేశభక్తి చిత్రాలకు ప్రసిద్ధి చెందారు. దీంతో ఆయనకు 'భరత్ కుమార్' అనే బిరుదు వచ్చింది. అతను ఒక జాతీయ చలనచిత్ర అవార్, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నాడు.
1937లో జన్మించిన హరికృష్ణ గోస్వామి (మనోజ్ కుమార్) 1957లో 'ఫ్యాషన్' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 'కాంచ్ కీ గుడియా' అనే సినిమాలో నటించి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత దర్శకుడిగా, రచయితగా, నటుడిగా ప్రేక్షకులకు చేరువయ్యారు. ఎక్కువగా దేశభక్తి సినిమాలు తెరకెక్కించడంతో ఆయన పేరు భరత్‌కుమార్‌గా మారిపోయింది. 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమకు సేవలు అందించారు. బాలీవుడ్లో అగ్రహీరోలతో సినిమాలు రూపొందించారు. మనోజ్ కుమార్ తన కెరీర్‌లో ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఆయన చిత్రపరిశ్రమకు చేసిన సేవలకు గాను 1982లో పద్మశ్రీ, 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.