మన్నవ బాలయ్య మృతి పట్ల బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్
Veteran Actor M Balayya passes away Balakrishna offer condolences.ప్రముఖ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య శనివారం
By తోట వంశీ కుమార్ Published on
9 April 2022 7:05 AM GMT

ప్రముఖ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 'ఎత్తుకు పై ఎత్తు' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన బాలయ్య దాదాపు 300 చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాక, దర్శకుడిగా, నిర్మాతగానూ రాణించారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ సైతం తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
'సీనియర్ నటుడు మన్నవ బాలయ్య గారి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. బాలయ్య గారు అద్భుతమైన నటులు, నాన్న గారితో కలిసి నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా బాలయ్య తన ప్రతిభను చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం వుంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అంటూ నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
Next Story