మన దగ్గర పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేళాయె

టాలీవుడ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

By Medi Samrat  Published on  29 Nov 2024 7:52 PM IST
మన దగ్గర పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేళాయె

టాలీవుడ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. పుష్ప 2 బృందం ఆయా ప్రాంతాల్లో హైప్ క్రియేట్ చేయడానికి ప్రముఖ నగరాల్లో అనేక కార్యక్రమాలను నిర్వహించింది. తెలుగురాష్ట్రాలకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇంకా నిర్వహించలేదు. పుష్ప 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 1వ తేదీన మల్లారెడ్డి కాలేజీలో ఈ కార్యక్రమం జరగనుందని, అదే ఈవెంట్‌లో ఈ చిత్రంలోని 4వ సింగిల్ 'పీలింగ్స్‌'ను కూడా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ ప్రోమో ఇప్పుడు వైరల్‌గా మారింది. సినిమా మీద అంచనాలను మరింత పెంచేలా కొత్త ట్రైలర్‌ని కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా 3 గంటల 20 నిమిషాల రన్‌టైమ్‌తో వస్తోంది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్‌ ఇవ్వనున్నారు. అడ్వాన్స్‌డ్ బుకింగ్‌లు కూడా ఈ వారాంతం నుండి తెరవనున్నారు. పుష్ప 2 మొదటి రోజు భారీ ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు.

Next Story