వెంకీ మామ.. దృశ్యం-2 ని పూర్తీ చేసేశాడట..!

Venky Completes Drishyam 2 Movie shooting.దృశ్యం-2.. విక్టరీ వెంకటేష్ తన షెడ్యూల్ ను పూర్తీ చేసేశారని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2021 8:02 PM IST
Drishyam 2

దృశ్యం-2.. మోహన్ లాల్ నటించిన ఈ మళయాళ సినిమా ఇటీవలే ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక తెలుగులో దృశ్యం భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే..! ఇక తెలుగు భాగాన్ని కూడా ఇటీవల రీమేక్ చేయడాన్ని మొదలు పెట్టారు. చిత్ర షూటింగ్ యమా స్పీడ్ గా సాగిపోయిందని తాజాగా తెలుస్తోంది. మెయిన్ లీడ్ చేస్తున్న విక్టరీ వెంకటేష్ తన షెడ్యూల్ ను పూర్తీ చేసేశారని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేసింది. దీంతో ఇంకో రెండు మూడు నెలల్లో సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమాలో మీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మాతృక దర్శకుడు జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి మొదటి వారంలో సినిమా ప్రారంభమైంది. దాదాపు నెల రోజుల్లోనే తన షూటింగ్ ను పూర్తీ‌ చేశాడు వెంకటేష్. గురువారం తన పార్ట్ షూటింగ్‌ని పూర్తి చేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది. సినిమా మొత్తం షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుందని, త్వరలోనే అది కూడా పూర్తవుతుందని చిత్ర బృందం చెబుతోంది. సురేష్‌ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్‌బాబు నిర్మిస్తున్నారు. వెంకీ నుంచి ఈ ఏడాది మూడు సినిమాలు రాబోతున్నాయి. `నారప్ప` మే 14న విడుదల కానుంది. ఆ తర్వాత `దృశ్యం2` రిలీజ్‌ కానుంది. ఆగస్ట్ లో `ఎఫ్‌3`ని విడుదల చేయనున్నారు.


Next Story