వీరసింహారెడ్డి నుంచి స్పెష‌ల్ అప్‌డేట్‌.. 'మా బావ మనోభావాలు'

Veera Simha Reddy special song releasing on December 24.నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్రం వీర సింహా రెడ్డి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Dec 2022 11:32 AM IST
వీరసింహారెడ్డి నుంచి స్పెష‌ల్ అప్‌డేట్‌.. మా బావ మనోభావాలు

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్రం 'వీర సింహా రెడ్డి'. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణంత‌ర కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, 'జై బాలయ్య', 'సుగుణ సుందరి' పాటలకు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో మ‌రో అదిరిపోయే అప్‌డేట్‌ను ఇచ్చింది. 'మా బావ మనోభావాలు' అంటూ సాగే స్పెష‌ల్ పాట‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది. న్యూఇయ‌ర్ పార్టీల్లో స్పీక‌ర్లు ప‌గిలిపోవాలా, థియేట‌ర్ల‌లో మోత మోగిపోవాలా అంటూ ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌తో డిసెంబ‌ర్ 24న పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. కొత్త పోస్ట‌ర్‌లో బాల‌య్య గెట‌ప్ అదిరిపోయింది.

కన్నడ యాక్టర్‌ దునియా విజయ్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా వర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Next Story