గని సినిమా ఫలితంపై వరుణ్ తేజ్ పోస్ట్.. వైరల్
Varun Tej response on Ghani movie result.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల గని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
By తోట వంశీ కుమార్ Published on 13 April 2022 10:24 AM ISTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల 'గని' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలు. ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, నదియా, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సాయీ మంజ్రేకర్ కథానాయిక. అమ్మ సెంటిమెంట్‌తో పాటు బాక్సర్ కావాలనే తన కలను నెరవేర్చుకోవడం కోసం ఓ యువకుడు పడే తపన కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం కరోనా మహమ్మారి కారణంగా పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఇటీవల విడుదలైంది.
అయితే.. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. కాగా.. తాజాగా సినిమా ఫలితం మెగా హీరో వరుణ్ తేజ్ స్పందించాడు. 'ఇన్నాళ్లుగా మీరు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. 'గని' చిత్ర రూపకల్పనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మనసా వాచా మీరంతా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. మరీ ముఖ్యంగా నా నిర్మాతలకు ధన్యవాదాలు. మనసు పెట్టి, ఎంతో కష్టపడి ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని మేమంతా పనిచేశాం. కానీ ఎందుకో మా ఆలోచనలు తెర మీద ప్రతిఫలించలేదనిపించింది. ఎల్లప్పుడూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే కోరుకుంటాను. కొన్ని సార్లు విజయం సాధిస్తాం, మరికొన్ని సార్లు దాని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోంటాను. అయితే.. ఫలితాలు ఎలా ఉన్నా నేను పడే కష్టంలో ఎలాంటి మార్పు ఉండదు 'అని వరుణ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. ప్రస్తుతం వరుణ్ నటిస్తున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
— Varun Tej Konidela (@IAmVarunTej) April 12, 2022