విజేతగా నిలిచేది ఒక్కడే.. ఆ ఒక్కడు నువ్వెందుకు అవ్వాలి: రామ్‌చరణ్‌

Varun tej movie ghani teaser out now. ప్రతి ఒక్కడి కథలో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి.. కోరికలు ఉంటాయి కోపాలు ఉంటాయి. కలబడితే గొడవలు అవుతాయి.

By అంజి  Published on  15 Nov 2021 12:03 PM IST
విజేతగా నిలిచేది ఒక్కడే.. ఆ ఒక్కడు నువ్వెందుకు అవ్వాలి: రామ్‌చరణ్‌

"ప్రతి ఒక్కడి కథలో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి.. కోరికలు ఉంటాయి కోపాలు ఉంటాయి. కలబడితే గొడవలు అవుతాయి. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కడికీ చాంపియన్‌ అయిపోవాలన్న ఆశ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే.. ఆ ఒక్కడు నువ్వెందుకు అవ్వాలి.. వై యూ.. ఆట ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటాం. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటాం" అని అంటున్నారు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్. వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన 'గని' సినిమా నుండి టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌కు రామ్‌ చరణ్‌ వాయిస్‌ అందించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే 'గని' టీజర్‌ను సినిమా యూనిట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

చిన్నప్పటి నుండే ఎన్నో కష్టాలు ఎదుర్కొనున్న ఓ యువకుడు.. బాక్సింగ్‌ క్రీడాకారుడిగా ఎలా ఎదిగాడు. ఎలా చరిత్ర సృష్టించాడు. కెరీర్‌ పీక్స్‌ టైమ్‌లో అతడు ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ అన్న ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. 'గని' సినిమా పూర్తిగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. బాక్సింగ్‌ క్రీడాకారుడి నేపథ్యంతో సాగే ఈ సినిమా కోసం హీరో వరుణ్‌ తేజ్‌ ఫిట్‌నెస్‌ విషయంలో చాలా ట్రైనింగ్‌ తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా బాలీవుడ్‌ నటి సాయీ మంజ్రేకర్‌ సందడి చేయనున్నారు. ఉపేంద్ర, జగపతిబాబు వంటి వారు ఈ సినిమా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'గని' సినిమా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


Next Story