వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్.. అఫీషియల్‌ అనౌన్స్

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వరుణ్‌ తేజ్‌, లావణ్యలు తమ

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 8 Jun 2023 3:00 PM IST

Varun Tej, Lavanya Tripathi, engagement card , social media, Tollywood

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్.. అఫీషియల్‌గా అనౌన్స్ 

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వరుణ్‌ తేజ్‌, లావణ్యలు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంగేజ్‌మెంట్‌ కూడా ఫిక్స్ చేసుకున్నారు. జూన్ 9న ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్‌ జరగబోతోంది. తాజాగా ఈ విషయాన్ని వరుణ్‌ తేజ్‌ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది.

గత కొన్ని రోజులుగా వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే నిశ్చితార్థం వేడుకకు ఆహ్వానం ఉందట. లావణ్య-వరుణ్ జంటగా `మిస్టర్` మూవీ చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ అంచనాలు అందుకోలేదు. `అంతరిక్షం` సినిమాలో కూడా కలిసి నటించారు. అయితే గత ఏడాది నుంచి వరుణ్, లావణ్య రిలేషన్ షిప్ కు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి.

Next Story