వ‌రుణ్ తేజ్ మూవీకి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌.. మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Varun Tej 'Ghani' Movie motion poster.వ‌రుణ్ ప్ర‌స్తుతం బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఓ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఆ సినిమా టైటిల్, మోష‌న్ పోస్టర్ విడుద‌ల.‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2021 10:49 AM IST
Varun Tej Ghani Movie motion poster

'ముకుంద' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వ‌రుణ్ తేజ్‌. వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ మంచి విజ‌యాల‌ను సొంతం చేసుకుంటున్నాడు. వ‌రుణ్ ప్ర‌స్తుతం బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఓ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు కిరణ్‌ కొర్రపాటి తెర‌కెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నేడు వ‌రుణ్ తేజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉద‌యం 10 గంట‌ల 10 నిమిషాల‌కు 'VT10' ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసి వరుణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేసారు. మెగా ప్రిన్స్ బాక్సర్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ''గని'' అని టైటిల్ ని ఖరారు చేశారు.

ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో బాక్సింగ్ రింగ్ లో దిగిన బాక్సర్ గా వరుణ్ తేజ్ ని చూపించారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్ కెరీర్‌లో 10వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్‌, బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ బ్యానర్స్‌పై అల్లు వెంకటేశ్‌‌, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. 'బాలు' సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు 'గని' అనే విషయం తెలిసిందే. ఇప్పుడు బాబాయ్ పేరునే అబ్బాయ్ సినిమా టైటిల్ గా పెట్టుకున్నాడు.




Next Story