ఆదివారం పెళ్లి.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కారుకు యాక్సిడెంట్

Varun Dhawan's Car Meets with an Accident. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్ పెళ్లి ఆదివారం నాడు చేసుకోబోతున్నాడు. ఇంతలో అతడి కారుకు యాక్సిడెంట్ జరిగింది.

By Medi Samrat
Published on : 24 Jan 2021 1:48 PM IST

Varun Dhawans Car Meets with an Accident

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆదివారం నాడు వరుణ్ ధావన్ పెళ్లిపీటలు ఎక్కబోతూ ఉండగా.. ఇంతలో అతడి కారుకు యాక్సిడెంట్ జరిగింది అన్న వార్త దావానంలా వ్యాపించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటూ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. వరుణ్ ధావన్‌ కారు శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. వరుణ్‌ పెళ్లి సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసిన బ్యాచిలర్‌ పార్టీలో పాల్గొని వివాహ వేదిక దగ్గరకు తిరిగెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

వరుణ్‌ ధావన్‌ పెళ్లి ఆదివారం జరగనుంది. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న నటాషా దలాల్ను పెళ్లి చేసుకోబోతున్నాడు వరుణ్. అలీభాగ్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వీరిద్దరి వివాహ వేడుక జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాల వారు హోటల్‌కు చేరుకున్నారు. శనివారం జరిగిన మెహందీ వేడుకలో బాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. కరోనా నేపథ్యంలో కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్యే ఈ వివాహ వేడుక జరగనుంది. వరుణ్-నటాషాలు చిన్నప్పటి నుండి ఒకరికి ఒకరు తెలుసు. నటాషాను తాను 6వ తరగతిలో మొదటిసారి కలిశానని గతంలో వరుణ్ ధావన్ వెల్లడించాడు.


Next Story