టాలీవుడ్‌లో విషాదం.. గుండెపోటుతో హీరో స‌త్య మృతి

Varam Movie fame Hero Satya passed away.టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయమై.. ఆ తర్వాత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2022 8:34 AM IST
టాలీవుడ్‌లో విషాదం.. గుండెపోటుతో హీరో స‌త్య మృతి

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయమై.. ఆ తర్వాత 'వరం', 'బ్యాచ్‌లర్స్', చిత్రాల్లో హీరోగా చేసిన న‌టుడు స‌త్య గుండెపోటుతో క‌న్నుమూశాడు. గురువారం సాయంత్రం గుండెపోటు రావ‌డంతో కుటుంబ స‌భ్యులు అత‌డిని ద‌గ్గ‌ర‌లోని ఆస్ప‌త్రికి త‌రలించారు. అయితే.. అప్ప‌టికే స‌త్య మృతి చెందిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు. ఆయన మరణవార్త తెలిసిన బంధువులు, సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు.. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం తెలుపుతున్నారు.

సత్య పూర్తి పేరు వి.రామసత్యనారాయణ. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన తొలినాళ్ల‌లో హీరో స్నేహితుడి పాత్రలు పోషించారు. ఆ త‌రువాత వరం చిత్రంతో కథానాయకుడిగా మారారు. ఈ సినిమా పెద్దగా విజయవంతం ​కాలేదు. ఆ తర్వాత బ్యాచిలర్స్‌ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇది కూడా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు గ‌త కొంత‌కాలంగా దూరంగా ఉంటూ బిజినెస్‌పై దృష్టి పెట్టారు.

ఇదే స‌మ‌యంలో క‌రోనా సెకండ్ వేవ్ అత‌డి కుటుంబాన్నిఛిన్నాభిన్నం చేసింది. క‌రోనా బారిన ప‌డి అత‌డి త‌ల్లి, భార్య మ‌ర‌ణించారు. ఇది స‌త్య‌ను మాన‌సికంగా దెబ్బ‌తీసింది. ప‌దేళ్ల క్రితం అత‌డికి వివాహాం జ‌రుగ‌గా 8 ఏళ్ల కుమారై రిత్విక ఉంది. హైదరాబాద్‌లో ఈఎస్ఐ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వ‌హించారు.

Next Story