ప్రధాని మోదీకి పెళ్లి పత్రిక అందించిన వరలక్ష్మి

తమిళ-తెలుగు నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన వివాహ ఆహ్వాన పత్రికను ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు.

By Medi Samrat  Published on  29 Jun 2024 5:15 PM IST
ప్రధాని మోదీకి పెళ్లి పత్రిక అందించిన వరలక్ష్మి

తమిళ-తెలుగు నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన వివాహ ఆహ్వాన పత్రికను ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో తన కాబోయే భర్త నికోలాయ్ సచ్‌దేవ్, తండ్రి ఆర్ శరత్‌కుమార్, రాధికా శరత్‌కుమార్‌లతో కలిసి కనిపించారు. వరలక్ష్మి ప్రధాని మోదీని కలిసిన సెల్ఫీతో సహా పలు ఫోటోలను షేర్ చేసింది.

"మన గౌరవనీయ ప్రధాని మోదీ గారిని కలవడం ఎంతటి గొప్ప అవకాశం! ఆయనను మా వివాహ రిసెప్షన్ కు రావాలని ఆహ్వానించాం. మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించిందుకు, ఎంతో బిజీ షెడ్యూల్ లోనూ మా కోసం సమయం కేటాయించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నిజంగా ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం సర్. థాంక్యూ డాడీ... ప్రధాని మోదీని కలిసే అవకాశం నీ వల్లే సాధ్యమైంది" అంటూ వరలక్ష్మి పోస్టు పెట్టింది. పెళ్లికి ఆహ్వానించడానికి వరలక్ష్మి, ఆమె కుటుంబం వ్యక్తిగతంగా పలువురు VIP అతిథులను కలుస్తూ ఉన్నారు. ఆమె రజనీకాంత్, అతని భార్య లత, కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌లను కూడా కలిశారు.

Next Story