ఉర‌క‌లెత్తిన అభిమానం.. ప‌గిలిన అద్దాలు.. వీడియో వైర‌ల్‌

Vocabulary Saab Trailer .విశాఖ‌ప‌ట్నంలో ఓ థియేట‌ర్‌లో వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్‌ను చూసేందుకు ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఎగ‌బ‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2021 6:22 AM GMT
vakeel sabb

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం 'వ‌కీల్ సాబ్‌'. దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్ నటిస్తున్న చిత్రం కావ‌డంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ రికార్డు వ్యూస్‌ల‌తో దూసుకెలుతోంది. ట్రైల‌ర్‌లో ప‌వ‌న్ డైలాగ్‌లు అభిమానుల‌ను అల‌రిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను ట్రైల‌ర్‌తో రెట్టింపు అయ్యాయి. శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజ్‌, శిరీశ్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్‌ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నంలో ఓ థియేట‌ర్‌లో వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్‌ను చూసేందుకు ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఎగ‌బ‌డ్డారు. ఒక‌రినొక‌రు తోసుకుంటూ, అద్దాలు ప‌గ‌ల‌కొట్టి మ‌రీ లోప‌లికి వెళ్లారు. దీంతో ప‌లువురు ప‌వ‌న్ అభిమానుల‌కు స్వ‌ల్ప‌గాయాలు అయ్యాయి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారింది.
Next Story
Share it