వకీల్ సాబ్ రివ్యూ- మెసేజ్ తో ఆకట్టుకునే పవన్ హీరోయిజమ్.!

Vakeel Saab Movie Review. లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ నుండి రిలీజవుతున్న పెద్ద సినిమా 'వకీల్ సాబ్' రివ్యూ.

By Medi Samrat  Published on  9 April 2021 4:42 AM GMT
Vakeel Saab Movie Review

న‌టీన‌టులు- ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శృతిహాస‌న్‌, ప్ర‌కాశ్ రాజ్‌, నివేదాథామ‌స్‌, అంజలి, అన‌న్య నాగ‌ళ్ల త‌దిత‌రులు

దర్శకత్వం- శ్రీరామ్ వేణు

నిర్మాత‌లు- దిల్ రాజు, బోనీక‌పూర్‌

సంగీతం- థ‌మ‌న్‌

పవన్ సినిమా అంటే ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు. అలాంటి మూడేళ్ల గ్యాప్ తర్వాత రాబోతుండడంతో.. అంచనాలు ఎవరెస్టు అంచులను తాకుతున్నాయి. పైగా లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ నుండి రిలీజవుతున్న పెద్ద సినిమా 'వకీల్ సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కాగా పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రజలు కూడా భారీ అంచనాలతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు గ్రాండ్ గా విడుదల అయింది. మరి, ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చిందో చూద్దాం

కథ :

వ‌కీల్ సాబ్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) పేదలకు న్యాయం చేయడానికే 'లా' చదివి వకీల్ సాబ్ గా మారి.. న్యాయం చేయడం కోసం ఎవర్ని వదలకుండా అన్యాయం పై పోరాటం చేస్తాడు. అయితే అతని జీవితంలో జరిగిన ఒక సంఘటన కారణంగా తాగుడిని అలవాటు చేసుకుని ఒంటరిగా ఉంటాడు. మరోపక్క జరీనా (అంజలి) పల్లవి (నివేదా థామస్) అనన్య (అనన్య) ముగ్గురు మిడిల్ క్లాస్ అమ్మాయిలైన వీళ్ళు ఒకే రూంలో ఉంటూ హైదరాబాద్ లో జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. ఐతే ఒకరోజు రాత్రి పార్టీ నుండి వెళ్తూ.. అనుకోకుండా వంశీ (విల‌న్) గ్యాంగ్ తో వాళ్ళ రిసార్ట్ కి వెళ్లడం... అక్కడ వీరి పై లైంగిక దాడి జరగడం, ఆపై కొన్ని సంఘటనల అనంతరం వీళ్ళ పై కోర్టులో తప్పుడు కేసు ఫైల్ అవుతుంది. . ఏ దిక్కూ లేని ఈ అమ్మాయిల పక్షాన‌ నిలుస్తాడు వ‌కీల్ సాబ్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్). బలహీనులకు బలాన్ని ఇచ్చే వకీల్ సాబ్ ఈ అమ్మాయిలకు ఎలా న్యాయం జరిగేలా చేశాడు ? బ‌ల‌మైన లాయ‌ర్ నందా (ప్రకాష్ రాజ్)ను ఎలా ఢీ కొన్నాడు ? అనేది మిగిలన కథ.

విశ్లేషణ :

పవర్ స్టార్ పవన్ కల్యాణే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. లాయర్ వకీల్ సాబ్ పాత్రలో పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా అబ్బురపరిచాడు. ముఖ్యంగా కోర్టులో ఎమోషనల్ గా సాగే సన్నివేశంలో పవన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తం మీద లాయ‌ర్ గా ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌ట‌న తార‌స్థాయిలో ఉంది. అన్యాయాన్ని ఎదిరించే వ‌కీల్ సాబ్ గా విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించాడు. ఇక బాధిత యువ‌తులుగా అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య అద్భుతంగా న‌టించారు. చేష్ట‌లుగిన అభాగ్యుల పాత్ర‌ల్లో వాళ్ళు ఒదిగిపోయారు. వారి ఎమోషన్ కూడా చాలా బాగా పడింది. క్రిమిన‌ల్ లాయ‌ర్ గా ప్ర‌కాష్ రాజ్, ప‌వ‌న్ భార్యగా శృతిహాస‌న్ కూడా ఆక‌ట్టుకున్నారు. మెయిన్ గా నివేదా నటన చాలా బాగుంది. దర్శకుడు వేణు శ్రీ రామ్ కంటెంట్ బేస్డ్ స్టోరీలో హీరోయిజమ్ పెట్టిన విధానం, అలాగే పవన్ ను చూపించే విధానం చాలా బాగుంది.

అయితే, ఇంట్రస్టింగ్ గా సాగుతున్న సినిమాలో హీరో లవ్ ట్రాక్, లవ్ లో పడే సీన్స్ అంత ఎఫెక్టివ్ గా ఆనిపించవు. లవ్ స్టోరీ ఇంకా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. పైగా ఇంటర్వెల్ కి గాని అసలు కథ ముందుకు కదలదు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. థమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటర్ సినిమాలోని సాగతీత సీన్స్ ను తగ్గించి ఉంటే ప్లస్ అయ్యేది. నిర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు.

ప్లస్ పాయింట్స్ :

పవన్ కళ్యాణ్ నటన,

కథకథనాలు,

డైలాగ్స్,

ఎమోషనల్ సీన్స్,

మెసేజ్ తో సాగే స్క్రీన్ ప్లే.

సాంగ్స్,

పవన్ క్యారెక్టరైజేషన్,

ప్ర‌కాశ్ రాజ్‌, నివేదాథామ‌స్‌, అంజలి నటన, వారి పాత్రలు

మైనస్ పాయింట్స్ :

లవ్ ట్రాక్,

స్లోగా సాగే కోర్టు సీన్స్

చివరగా :

వకీల్ సాబ్ అంటూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కి ఈ సినిమాతో అదిరిపోయే రేంజ్ లో ఫుల్ కిక్ ను ఇచ్చారు. పవన్ ఫ్యాన్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. మెసేజ్ తో పాటు ఇంట్రస్ట్ గా సాగే హీరో క్యారెక్టరైజేషన్ అలాగే ఎమోషన్స్ మరియు సాంగ్స్ ్ సినిమా స్థాయిని పెంచాయి. ఓవరాల్ గా వకీల్ సాబ్ అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అకట్టుకుంటుంది. పవన్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా.

పంచ్ లైన్ : వకీల్ సాబ్ కాదు బాక్సాఫీస్ కింగ్.


Next Story