వ‌కీల్ సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Vakeel saab movie release date announced.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం వ‌కీల్‌సాబ్‌ రిలీజ్ డేట్ ఫిక్స్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jan 2021 6:26 PM IST
Vakeel saab movie release date announced

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం 'వ‌కీల్‌సాబ్‌'. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. ప‌వ‌న్‌ను లాయ‌ర్ కోటులో చూపిస్తూ.. ఓ ప‌వ‌ర్‌పుల్ డైలాగ్‌తో కూడిన టిజ‌ర్ అభిమానుల‌కు ఆక‌ట్టుకుంది. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి రాకుంటే ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉంది. 'క్రాక్' సినిమా సక్సెస్‌తో అంద‌రు హీరోలు వ‌రుస బెట్టి త‌మ చిత్రాల‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పేస్తున్నారు.


ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తున్న ప‌వ‌న్ చిత్రం ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురుచూస్తుండ‌గా.. చిత్ర యూనిట్ శుభ‌వార్త చెప్పింది. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు శ‌నివారం అధికారికంగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Next Story