ప్రస్తుతం కరోనా మహమ్మారి విపరీతంగా ప్రబలుతూ ఉండడంతో సినిమా థియేటర్ల వైపు ప్రజలు కన్నెత్తి చూడడం లేదు. అందుకే ఓటీటీలలో సినిమాల సందడి మరోసారి మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ 'అమెజాన్ ప్రైమ్' లో సందడి చేస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా అనన్య నాగల్ల, నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది. మరో కీలకపాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు. ఈ సినిమా ఓటీటీలో 50 రోజుల తర్వాతనే వస్తుందని గతంలో దిల్ రాజు చెప్పుకొచ్చారు. కానీ ఊహించిన డేట్ కంటే ముందే ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. ఇది కూడా ఆయనకు లాభాన్నే తీసుకుని వచ్చిందని అంటున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ మంచి కలెక్షన్లను అందుకోగా.. ఇప్పుడు ఇలా ఓటీటీలో ముందుగా రిలీజ్ చేసి మంచిగా ఆర్జించారు దిల్ రాజు అని చెబుతూ ఉన్నారు.
'వకీల్ సాబ్' చిత్రం విడుదలై నెలరోజులు కూడ గడవకముందే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. వకీల్ సాబ్ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుందన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతం కావడం, కేసులు పెరగడంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో నిర్మాత దిల్ రాజు ఓటీటీ ఎర్లీ రిలీజ్ ఆప్షన్ ఎంచుకున్నారు. ఈ ముందస్తు విడుదల ద్వారా నిర్మాతకు రూ.12 కోట్ల వరకు అదనపు లాభం చేకూరినట్టు సమాచారం. థియేటర్లలో సినిమాను మిస్సైన వారు 'వకీల్ సాబ్'ను ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు.