'వారసుడు' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
Vaarasudu Movie OTT Date Fix.తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం వారీసు.
By తోట వంశీ కుమార్ Published on 4 Feb 2023 11:57 AM ISTతమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం 'వారీసు'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'వారసుడు' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ లు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. మదర్ సెంటిమెంట్‌తో పాటు విజయ్ యాక్టింగ్ అభిమానులను కట్టిపడేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా..? అని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఈ చిత్ర ఓటీటీ హక్కులను అమెజాన్ సంస్థ భారీ మొత్తానికి దక్కించుకుంది. వాస్తవానికి ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ సంస్థ బావించింది. అయితే.. ఇంకా కొన్ని థియేటర్లలో ఈ చిత్రం విజయవంతంగా నడుస్తుండడంతో ఫిబ్రవరి 22కు వాయిదా వేసినట్లు సమాచారం.
తమిళం, తెలుగుతో పాటు దక్షిణాది బాషలు అన్నింటిలో అదే రోజు అమెజాన్ ప్రైమ్‌లో 'వారీసు' చిత్రం స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అమెజాన్ త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనుందని తెలుస్తోంది.