ప్రముఖ అమెరికన్‌ సింగర్‌, నటుడు.. మీట్ లోఫ్ (74) కన్నుమూత

US singer Meat Loaf dies at 74. "బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్" ఆల్బమ్‌తో ప్రపంచ ఖ్యాతిని సంపాదించిన యుఎస్ రాక్ స్టార్, ప్రముఖ సింగర్‌, నటుడు మీట్‌ లోఫ్‌

By అంజి  Published on  21 Jan 2022 9:34 AM GMT
ప్రముఖ అమెరికన్‌ సింగర్‌, నటుడు.. మీట్ లోఫ్ (74) కన్నుమూత

"బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్" ఆల్బమ్‌తో ప్రపంచ ఖ్యాతిని సంపాదించిన యుఎస్ రాక్ స్టార్, ప్రముఖ సింగర్‌, నటుడు మీట్‌ లోఫ్‌ (74) మరణించారు. మైఖేల్ లీ అడే అని పిలువబడే అమెరికన్ గాయకుడు, నటుడు అయిన మీట్‌లోప్‌ ఆరు దశాబ్దాల కెరీర్‌ను కలిగి ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ఆల్బమ్‌లను అతడు విక్రయించాడు. అతని హిట్‌లలో "బ్యాట్ ఆఫ్ హెల్", "ప్యారడైజ్ బై ది డ్యాష్‌బోర్డ్ లైట్" నుండి దాదాపు 10 నిమిషాల నిడివి గల టైటిల్ ట్రాక్, "ఐ డ్ డూ ఎనీథింగ్ ఫర్ లవ్ (బట్ ఐ వోంట్ డూ దట్)" ఉన్నాయి. మీట్‌ లోఫ్‌ మరణాన్ని అతని అధికారిక ఫేసుబుక్‌ పేజీలో ప్రకటించారు. సింగర్‌ మీట్‌లోఫ్‌ భార్య అతని పక్కనే ఉందని, అతని చివరి 24 గంటలు అతని స్నేహితులతో ఉన్నారని ప్రకటన పేర్కొంది.

అతని కుటుంబ సభ్యులు, ప్రతినిధులు వెంటనే మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. మీట్ లోఫ్ 1970ల చివరలో తన పాటలతో విలాసవంతమైన స్టేజీలపై తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. మీట్‌ లోఫ్‌ బీఫీ టెక్సాస్‌లో జన్మించారు. 1977 "బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్" ఆల్బమ్, "ప్యారడైజ్ బై ది డ్యాష్‌బోర్డ్ లైట్" (1977), "ఐ యామ్ గొన్నా లవ్ హర్ ఫర్ అస్ బాత్ అస్" (1981) వంటి హిట్ పాటలతో మీట్‌ లోఫ్‌ ప్రసిద్ధి చెందాడు. "బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్" దాదాపు 43 మిలియన్ కాపీలు అమ్ముడైంది. అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్‌లలో ఇది ఒకటి. మీట్‌ లోఫ్‌ 65 సినిమాల్లో నటించాడు. అతని రాక్ సాంగ్‌లను పక్కన పెడితే, మీట్ లోఫ్ చలనచిత్రాలు, టీవీ షోలలో నటించాడు. ఇందులో సంగీత హాస్య చిత్రం "రాకీ హారర్ పిక్చర్ షో" (1975), "ఫైట్ క్లబ్" (1999) ఉన్నాయి.

Next Story