రెండు స్పెషల్ సాంగ్స్‌తో టాలీవుడ్‌లో సంద‌డి చేయ‌నున్న‌ బాలీవుడ్ బ్యూటీ .!

Urvashi Rautela will do two special songs in Tollywood. చురకత్తుల్లాంటి హస్కీ లుక్స్ తో ఆకట్టుకునే భామ 'ఊర్వశి రౌతేలా'. మంచి డ్యాన్సర్ గా

By Sumanth Varma k  Published on  8 Nov 2022 4:35 PM IST
రెండు స్పెషల్ సాంగ్స్‌తో టాలీవుడ్‌లో సంద‌డి చేయ‌నున్న‌ బాలీవుడ్ బ్యూటీ .!

చురకత్తుల్లాంటి హస్కీ లుక్స్ తో ఆకట్టుకునే భామ 'ఊర్వశి రౌతేలా'. మంచి డ్యాన్సర్ గా ఊర్వశి రౌతేలాకి బాలీవుడ్ లో మంచి నేమ్ ఉంది. ముఖ్యంగా ఊర్వశి రౌతేలా ఇచ్చే ఎక్స్ ప్రేషన్స్ కు సోషల్ మీడియా షేక్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో ఊర్వశి రౌతేలా ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. అందుకే, ఆమె కోసం మేకర్స్ ఎగబడుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు పెద్ద సినిమాల్లో ఆమె స్పెషల్ సాంగ్స్ చేయబోతుంది. మెగా స్టార్ చిరంజీవి - బాబీ కలయికలో రాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ స్పెసల్ సాంగ్ లో 'ఊర్వశి రౌతేలా' కనిపించబోతుంది. ఈ సాంగ్ లో ఊర్వశి రౌతేలా' డ్యాన్స్ అదిరిపోతుందని.. అందుకే ఈ సాంగ్ కోసం తెగ ఎగ్జైట్ అయితుందని తెలుస్తోంది.

అలాగే, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బోయపాటి సినిమాలో కూడా ఊర్వశి రౌతేలా' ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుంది. ఇదొక ఫ్యామిలీ యాక్షన్ డ్రామా.. అయినా, 'ఊర్వశి రౌతేలా' సాంగ్ కి ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. డ్యాన్స్ పరంగా బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ 'ఊర్వశి రౌతేలా'.. మరి ఈ రెండు తెలుగు సాంగ్స్ తో టాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగిస్తోందేమో చూడాలి.




Next Story