థియేట‌ర్‌లో ఉపాస‌న హంగామా.. వీడియో వైర‌ల్‌

Upasana Celebrations in Theater goes viral.సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వ‌చ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2022 8:05 AM GMT
థియేట‌ర్‌లో ఉపాస‌న హంగామా.. వీడియో వైర‌ల్‌

సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వ‌చ్చింది. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం' రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)' నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌లు లీడ్ రోల్‌లో న‌టించ‌డంతో మెగా-నంద‌మూరి అభిమానుల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. సినిమా చూసిన వారంతా అదిపోయింది, సూప‌ర్ హిట్ కాదు బంప‌ర్ హిట్ అంటూ పొడిగేస్తున్నారు. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియానే క‌నిపిస్తోంది.

ఎన్టీఆర్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి AMB సినిమాస్‌లో బెనిఫిట్ సినిమాను చూడ‌గా.. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు భ్ర‌మ‌రాంభ థియేట‌ర్‌లో చిత్రాన్ని వీక్షించారు. అభిమానుల‌తో క‌లిసి ఉపాస‌న థియేట‌ర్‌లో హంగామా చేశారు. చ‌ర‌ణ్ న‌టించిన సీతారామ‌రాజు పాత్ర తెర‌పై వ‌చ్చిన ప్ర‌తీసారి అభిమానుల‌తో క‌లిసి పేప‌ర్లు విసురుతూ.. అల‌రుపుల‌తో ఎంజాయ్ చేశారు. దీంతో అభిమానులలో ఉత్సాహం రెట్టింపు అయింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Next Story
Share it