అన్‌స్టాపబుల్-2 : 'పవన్' ఎపిసోడ్ ప్రసారం అప్పుడే.!

Unstoppable Pawan Kalyan Episode. నట సింహం బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ సీజన్ 2 కూడా సూపర్ సక్సెస్ అయింది.

By Sumanth Varma k  Published on  4 Jan 2023 8:07 AM IST
అన్‌స్టాపబుల్-2 : పవన్ ఎపిసోడ్ ప్రసారం అప్పుడే.!

నట సింహం బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ సీజన్ 2 కూడా సూపర్ సక్సెస్ అయింది. ఐతే, రాబోయే ఎపిసోడ్స్ లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా ఉంది. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను షూట్ కూడా చేశారు. ఇక ఈ ఎపిసోడ్ ప్రీమియర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఆహా టీమ్ పవన్ ఎపిసోడ్ ని ఈ నెల ఎండింగ్ లో గానీ, పిబ్రవరి ఫస్ట్ వీక్ లో గానీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మరి బాలయ్య తన షోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ప్రశ్నలు వేశాడు ? అన్నదే ఇప్పుడు ప్రధాన ఆసక్తి.

ఏది ఏమైనా పవన్ - బాలయ్య ఒకే వేదిక పై, పైగా ఇద్దరి మధ్య పర్సనల్ విషయాలు డిస్కషన్ కి రావడం నిజంగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సే. మొత్తానికి బాలయ్య - పవన్ ఎపిసోడ్ సరికొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయం అంటున్నారు. అన్నిటికీ మించి ఈ ఎపిసోడ్ పై ఏపీ రాజకీయాలు కూడా ముడిపడి ఉన్నాయి. కారణం పవన్ - బాలయ్య.. జగన్ ప్రభుత్వం పై విముఖ‌త వ్య‌క్తం చేయ‌డం. నిజానికి బాలయ్య - పవన్ ల మధ్య రాజకీయ వార్ ఉన్నా.. ఇప్పుడు ఇద్దరి టార్గెట్ ఒక్కరే. జగన్ ను సీఎం పదవి నుంచి దించడం. ఈ నేపథ్యంలో పవన్ - బాలయ్య రాజకీయాల గురించి ఏం మాట్లాడుకున్నారో అని ఫ్యాన్స్‌, రాజ‌కీయ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి.




Next Story