అర్థ‌రాత్రి మహేష్ బాబు ఇంట్లోకి చొర‌బ‌డేందుకు య‌త్నం.. గాయాలపాలైన వ్యక్తి

Unknown person attempt to break into mahesh babu house.సినీ న‌టుడు మ‌హేష్ బాబు ఇంట్లోకి చొర‌బ‌డేందుకు ఎత్తైన‌ ప్ర‌హారి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Sep 2022 3:39 AM GMT
అర్థ‌రాత్రి మహేష్ బాబు ఇంట్లోకి చొర‌బ‌డేందుకు య‌త్నం.. గాయాలపాలైన వ్యక్తి

సినీ న‌టుడు మ‌హేష్ బాబు ఇంట్లోకి చొర‌బ‌డేందుకు ఎత్తైన‌ ప్ర‌హారి గోడ‌ను దూకిన ఓ ఆగంత‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

జూబ్లీహిల్స్ రోడ్డు నం.81లో మ‌హేష్‌బాబు నివ‌సిస్తున్నారు. ఆయ‌న ఇంట్లో చోరీ చేయాల‌ని బావించిన ఓ దొంగ మంగ‌ళ‌వారం రాత్రి11.30 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌హారి దూకి లోప‌లికి వెళ్లాల‌ని అనుకున్నాడు. గోడ ఎక్కి కింద‌కు దూకాడు. అయితే.. గోడ చాలా ఎత్తుగా ఉండ‌డంతో కింద‌ప‌డి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. పెద్ద శ‌బ్ధం రావ‌డంతో సెక్యూరిటీ సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు వెళ్లారు. ఓ వ్య‌క్తి గాయ‌ప‌డి ఉండ‌డాన్ని గుర్తించారు. వెంట‌నే అత‌డిని ప‌ట్టుకుని విచారించ‌డంతో పాటు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అత‌డిని అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిందితుడిని ఒడిశాకు చెందిన కృష్ణ గా గుర్తించారు. మూడు రోజుల క్రిత‌మే అత‌డు న‌గ‌రానికి వ‌చ్చి ఓ న‌ర్స‌రీ వ‌ద్ద ప‌ని చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు మ‌హేశ్ బాబు ఇంట్లో లేరు.సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story