టక్ జగదీశ్.. రిలీజ్ డేట్ వెనక్కు వెళ్ళింది..!

Tuck Jagadish Release Date Postponed. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కరోనా విజృంభిస్తోంది.తాజాగా టక్ జగదీశ్ సినిమా రిలీజ్ కూడా వెనక్కు వెళ్ళింది.

By Medi Samrat  Published on  13 April 2021 9:51 AM GMT
Tuck Jagadish

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కరోనా విజృంభిస్తోంది.. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల విషయంలో కూడా రచ్చ జరుగుతూ ఉంది. ప్రభుత్వం తక్కువ ధరకు సినిమా టికెట్ రేట్లను నిర్ణయించడంతో సినిమా రిలీజ్ లపై ప్రభావం చూపుతోంది. తాజాగా టక్ జగదీశ్ సినిమా రిలీజ్ కూడా వెనక్కు వెళ్ళింది.

నాని, రీతూవర్మ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'టక్ జగదీష్' సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. 'ఒక చిన్న బ్రేక్! చాలా చిన్నది' నాని మాట్లాడిన వీడియోను పోస్టు చేశారు. అలాగే ఉగాదికి ట్రైలర్ కూడా రావడం లేదని నాని అందులో తెలిపాడు. ఈ సంవత్సరం క్రాక్ నుంచి వకీల్ సాబ్ వరకు విడుదలైన చిత్రాలన్నీ ప్రేక్షకాదరణ పొందాయని నాని చెప్పాడు. తెలుగు ప్రేక్షకులను, సినిమాను విడదీయలేమని అన్నారు. అన్ని వర్గాల వారికి నచ్చేలా తమ చిత్రం ఉంటుందని, అయితే తమ చిత్రం రిలీజ్ విషయంలో చిన్న బ్రేక్ తీసుకుంటున్నామని, చాలా చిన్న బ్రేక్ అని తెలిపాడు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేస్తామని తెలిపింది. 'టక్ జగదీష్' ఈ నెల 23న రిలీజ్ కావాల్సి ఉండగా, ఇప్పుడా తేదీని చిత్రబృందం వాయిదా వేసింది. ఎప్పుడు రిలీజయ్యేది త్వరలోనే వెల్లడించనున్నారు.

'టక్ జగదీష్' మాత్రమే కాదు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన 'లవ్ స్టోరీ' విడుదల కూడా ఇంతకుముందే వాయిదాపడింది! ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరిస్తుండడం, టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలయ్యే పరిస్థితులు లేకపోవడంతోనే వాయిదా నిర్ణయం తీసుకుంటున్నట్టు భావిస్తున్నారు.
Next Story
Share it