కల్కి ట్రైలర్ వచ్చేది అప్పుడే.. అఫీషియల్ ప్రకటన

కల్కి ట్రైలర్‌ విడుదల తేదీని అధికారికంగా వెల్లడించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 AD'లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  29 Dec 2023 9:15 PM IST
కల్కి ట్రైలర్ వచ్చేది అప్పుడే.. అఫీషియల్ ప్రకటన

కల్కి ట్రైలర్‌ విడుదల తేదీని అధికారికంగా వెల్లడించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 AD'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగి సినిమాటిక్ యూనివర్స్ అంటూ లేదని ఆయన స్పష్టం చేశారు. 93 రోజుల తర్వాత కల్కి 2898 AD ట్రైలర్‌ని మీ ముందుకు వస్తుందని నాగ్ అశ్విన్ తెలిపారు. తాజాగా కల్కి ట్రైలర్‌ విడుదల తేదీని అధికారికంగా వెల్లడించారు. IIT బాంబేలో జరిగిన టెక్ ఫెస్ట్ 2023 సందర్భంగా, నాగ్ అశ్విన్ కొన్ని కొత్త విషయాలను పంచుకున్నారు. పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD ట్రైలర్‌ను 93 రోజుల తర్వాత ఏప్రిల్ 1, 2024న విడుదల చేయనున్నట్లు ప్రేక్షకులతో తన ఇంటరాక్షన్ సందర్భంగా దర్శకుడు చెప్పుకొచ్చాడు.

సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడదని.. టీమ్ 2024 వేసవి విడుదలను లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. ఏప్రిల్ 1వ వారంలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. మే 9 వైజయంతీ మూవీస్ కు సెంటిమెంట్ డేట్ కాబట్టి అన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేసి మే 9న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి ప్లాన్ ప్రకారం వస్తారా లేక వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి.

Next Story