విషాదం.. ప్రముఖ లేడీ యాంకర్ మృతి
తాజాగా హైదరాబాద్‌లో ప్రముఖ యాంకర్, లైవ్ హోస్ట్ శివాని సేన్ మృతి చెందారు. ఎపిలెప్టిక్ ఎటాక్ అనే ఆరోగ్య సమస్య వల్ల మృతి చెందినట్లు డాక్టర్లు చెబుతున్నారు.
By అంజి Published on 11 July 2023 6:43 AM ISTవిషాదం.. ప్రముఖ లేడీ యాంకర్ మృతి
మరణం ఎప్పుడు వస్తుందో ఎవరూ కూడా ఊహించలేనిది. తాజాగా హైదరాబాద్‌లో ప్రముఖ యాంకర్, లైవ్ హోస్ట్ శివాని సేన్ మృతి చెందారు. ఎపిలెప్టిక్ ఎటాక్ అనే ఆరోగ్య సమస్య వల్ల మృతి చెందినట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఆదివారం నాడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న శివాని సేన్.. ఓ వీడియోను కూడా రీట్వీట్ చేశారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఆమె మృతి చెందారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శివాని సేన్ నే లైవ్ హోస్ట్ గా, యాంకర్ గా వ్యవహరించి వాటిని విజయవంతం చేశారు.
యాంకర్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న శివాని సేన్.. 2005లో యాంకర్ కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటి నుండి, ఫోరల్ కార్పొరేట్ ఈవెంట్‌లు, కాన్ఫరెన్స్‌లు, మీడియా లాంచ్‌లు, వివాహాలు, వార్షిక ఈవెంట్‌లను నిర్వహిస్తూ వచ్చారు. దేశంలోనే ఫేమస్ యాంకర్‌గా శివానీ పేరు తెచ్చుకున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలకు కూడా శివానీ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ వేడుకను చాలా హుందాగా, ఉత్సాహభరితంగా కొనసాగించి విజయవంతం చేశారు.
టీ-హబ్, ఈ-కార్ రేసింగ్, హైదరాబాద్ ఈ మోటర్ షో వంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్స్‌కి ఆమె యాంకర్‌గా వ్యవహరించింది. ఇటీవలే చిరునవ్వుతో అందరికీ కనిపించిన శివానీ.. కన్నుమూయడం అందరినీ బాధిస్తోంది. బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు, పలు సంస్థలు చింతిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికన ఆమె మృతికి నివాళి అర్పిస్తున్నారు. ఇక శివానీ సేన్ 2019లో మిసెస్ సౌత్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. ఈ తెలుగు యాంకర్‌కి ఒక బాబు కూడా ఉన్నాడు.
We have an extremely shocking and sad news to share. One of our own, @mcshivanisen is no more.🥹🥹You left too soon Shivani, leaving a huge void. Life is so unfair at times. May your noble soul rest in peace!Please pray for the peaceful passage of our dear Shivani’s soul! pic.twitter.com/uzYWC5jhCu
— Team Saath Official🤝 (@TeamSaath) July 10, 2023