ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియా రాజ్ కుమార్ కన్నుమూశారు. చెన్నైలో గుండెపోటుకు గురైన ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే రంగరాజు హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు. బాలకృష్ణ నటించిన భైరవద్వీపంతో పాపులర్ అయ్యారు. తర్వాత యజ్ఞం, సీమ శాస్త్రి, జాంబిరెడ్డి, ఢమరుకం, శ్లోకం, మగరాయుడు, విశాఖ ఎక్స్‌ప్రెస్, మేం సహా పలు సినిమాల్లో విజయ రంగరాజు నటించారు.
రంగరాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రంగరాజు ఎక్కువగా విలన్ , సహాయ పాత్రలు పోషించారు. 1994 లో వచ్చిన భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. యజ్ఞం సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. యజ్ఞం చిత్రంలో హీరోగా గోపీచంద్ నటించగా విలన్ పాత్రలో విజయ రంగరాజు నటించాడు. రంగరాజు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఫైటర్ గా ఆయన 5 వేలకు పైగా సినిమాల్లో నటించారు. కాగా ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.