ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేశారు.
మాదాపూర్ నుండి కైతలాపూర్ గ్రౌండ్స్ మార్గం నేరుగా ఈవెంట్ వేదికకు దారితీస్తుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. కూకట్‌పల్లి ఐడిఎల్ (IDL) చెరువు నుండి కైతలాపూర్ ఫ్లైఓవర్ మార్గంలో వాహనాల మళ్లింపు ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి.