కొత్త ఇంటిని కొనుగోలు చేసిన.. స్పైడర్ మ్యాన్ లవ్‌బర్డ్స్‌.. ఎంతంటే.!

Tom Holland and Zendaya buy Rs 30 crore home in UK. ఇటీవల స్పైడర్ మ్యాన్: నో వే హోమ్‌లో నటించిన టామ్ హాలండ్, జెండయా తమ ప్రేమ సంబంధాన్ని తదుపరి స్థాయికి

By అంజి  Published on  31 Jan 2022 7:43 AM GMT
కొత్త ఇంటిని కొనుగోలు చేసిన.. స్పైడర్ మ్యాన్ లవ్‌బర్డ్స్‌.. ఎంతంటే.!

ఇటీవల స్పైడర్ మ్యాన్: నో వే హోమ్‌లో నటించిన టామ్ హాలండ్, జెండయా తమ ప్రేమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆన్‌ స్క్రీన్‌ మీద లాగే ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా కూడా వారిద్దరూ ప్రేమలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సౌత్ వెస్ట్ లండన్‌లో ఈ జంట రూ.30 కోట్లతో కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. టామ్, జెండయా 2016లో స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్ సెట్‌లో కలుసుకున్నారు. టామ్ హాలండ్, జెండయా వారి స్నేహితుల వివాహానికి సంబంధించిన వీడియోలు, చిత్రాలలో.. ఒకరి చేయి మరోకరు పట్టుకున్నప్పుడు డేటింగ్ చేసుకుంటున్నారని పుకార్లు వచ్చాయి. అయితే వారు ఆ వార్తలను నిజం చేస్తున్నారు.

అయితే మిర్రర్ నివేదిక ప్రకారం.. ఈ లవ్‌బర్డ్స్ లండన్‌లో ఒక భవనాన్ని కొనుగోలు చేశారు. దాదాపు రూ.30 కోట్ల ఖరీదు చేసే ఈ నివాసంలో జిమ్, సినిమా, ఇంకా చాలా ఉన్నాయి. సౌత్ వెస్ట్ లండన్‌లో ఉన్న తమ కొత్త ఇంటి కీలను సేకరించేందుకు స్పైడర్ మ్యాన్ స్టార్స్ లాస్‌ ఎంజిల్స్‌ నుండి వెళ్లారు. టామ్ హాలండ్, జెండయా ప్రేమలో ఉన్నారు. టామ్ పెరిగిన లండన్‌లో వారి మొదటి ఇల్లు ఉండాలని కోరుకున్నారు. అయితే టామ్ ఇప్పటికే యూకేలో మూడు పడకల ఫ్లాట్ యజమాని. మరోవైపు, హిట్ టీవీ సిరీస్ యుఫోరియాలో ఆమె పాత్రకు పేరుగాంచిన జెండయా లాస్ ఏంజిల్స్‌లో 3 మిలియన్ల డాలర్ల విలువ గల ఇంటిని కలిగి ఉంది.

Next Story
Share it