తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు చాంద్ బాషా క‌న్నుమూత‌

Tollywood Veteran Composer Chand Basha passed away.తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jan 2023 11:54 AM IST
తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు చాంద్ బాషా క‌న్నుమూత‌

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చాంద్ బాషా క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా వృద్దాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న శుక్ర‌వారం రాత్రి త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 92 సంవ‌త్స‌రాలు. చాంద్ బాషా ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్ భార్య సుచిత్ర కు తండ్రి. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియజేశారు.

ద‌క్షిణాదిలో అనేక చిత్రాల‌కు చాంద్ బాషా సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశారు. తెలుగులో ఖ‌డ్గ తిక్క‌న‌, బంగారు సంకెళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు వంటి సినిమాల‌కు సంగీతాన్ని అందించారు. చాంద్ బాషాకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. చాంద్ బాషా అంత్య‌క్రియ‌లు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో నేడు జ‌ర‌గ‌నున్నాయి.

Next Story