సూపర్‌స్టార్‌ కృష్ణకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.!

Tollywood superstar, Mahesh Babu's father Krishna hospitalised. హైదరాబాద్‌: టాలీవుడ్ సూపర్ స్టార్, సీనియర్ నటుడు కృష్ణ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురై

By అంజి  Published on  14 Nov 2022 5:41 AM GMT
సూపర్‌స్టార్‌ కృష్ణకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.!

హైదరాబాద్‌: టాలీవుడ్ సూపర్ స్టార్, సీనియర్ నటుడు కృష్ణ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ తెల్లవారుజామును శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. కృష్ణ అస్వస్థతకు గురి కావడంతో వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

త్వరలో మహేష్ బాబు ఆసుపత్రిని రానున్నట్లు సమాచారం. కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కొద్దిరోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కృష్ణను కృంగదీసింది. కృష్ణ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సినీ ప్రముఖులు కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణ నానక్‌రామ్‌ గూడలోని తన రెండో భార్య కొడుకు నరేశ్‌ దగ్గర ఉంటున్నాడు. కృష్ణ వయస్సు 79 సంవత్సరాలు. సినీ ఇండస్ట్రీలో ఐదు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగారు. అయితే చాలా కాలంగా కృష్ణ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

Next Story