సినిమా జూన్ 14న రిలీజ్.. అప్పుడే లీకుల దెబ్బ

సుధీర్ బాబు హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హరోమ్ హర' ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Jun 2024 8:00 PM IST
tollywood, sudheer, movie,  leakes,

సినిమా జూన్ 14న రిలీజ్.. అప్పుడే లీకుల దెబ్బ 

సుధీర్ బాబు హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హరోమ్ హర' ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. వరుసగా ఫ్లాప్‌లను చవిచూసిన సుధీర్ బాబు ఈ ప్రాజెక్ట్‌తో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కొద్దిరోజుల క్రితం విడుదలవ్వగా.. పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. సినిమా విడుదలకు ముందు, సినిమా ఇంటర్వెల్ బ్లాక్‌లో కొంత భాగం ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్ భారీ యాక్షన్‌ తో ఉంది. ఆన్‌లైన్‌లో వీడియో లీక్ అవ్వడంతో చిత్ర బృందంలో టెన్షన్ మొదలైంది.

జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ సినిమాలో మాళవిక శర్మ కూడా నటించింది. ఈ ప్రాజెక్ట్ విజయంపై సుధీర్ బాబు చాలా నమ్మకంగా ఉన్నాడు. లీకైన క్లిప్ ఖచ్చితంగా యూనిట్ మొత్తానికి ఆందోళన కలిగించే విషయమే. అయితే ఈ లీక్ అయిన క్లిప్ జనాన్ని థియేటర్లకు రప్పించగలదని అంటున్నారు. రెండు వారాల వరకు పెద్ద సినిమాల విడుదలలు ఏవీ లేకపోవడంతో.. హరోమ్ హర ప్రేక్షకులను ఆకట్టుకోగలదని అంటున్నారు.

Next Story