సంచలన నిర్ణయం.. రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్
Tollywood shooting will stop from tommarow. టాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో రేపటి నుంచి (ఆగస్టు 1 ) నుంచి షూటింగ్‌లు ఆపేయాలని ఫిలిమ్ చాంబర్
By అంజి Published on 31 July 2022 3:45 PM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో రేపటి నుంచి (ఆగస్టు 1 ) నుంచి షూటింగ్‌లు ఆపేయాలని ఫిలిమ్ చాంబర్ జనరల్ బాడీ మీటింగ్‌లో నిర్ణయించారు. గిల్డ్ నిర్ణయానికి ఫిలిం చాంబర్ మద్దతు తెలిపింది. సినిమా షూటింగ్‌లను కొన్ని రోజుల పాటు ఆపాలని నిర్ణయించినట్లు తెలుగు ఫిలిమ్ చాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి తెలిపారు. అందరం కూర్చొని మాట్లాడుకుందామని నిర్మాత్ దిల్ రాజ్ ఈ సందర్భంగా తెలిపారు. పరిష్కారం దొరికే వరకూ సినిమా చిత్రీకరణలు తిరిగి మొదలు పెట్టబోమన్నారు.
ఈ సమావేశంలో కొత్త సినిమాలతో పాటు, షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమాలు కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. తాజా నిర్ణయం సినీ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎవరూ హ్యాపీగా లేరని ఫిలిమ్ చాంబర్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అందరికీ న్యాయం చేయాలని చూస్తున్నామని బసిరెడ్డి తెలిపారు. రేపటి నుంచి ఫెడరేషన్ సమస్యలపై చర్చలు జరుపుతామన్నారు. సమస్యలకి పరిష్కారం దొరికేంత వరుకు ఇదే నిర్ణయంపై ఉంటామని చెప్పారు.
సినీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఫిలిం చాంబర్ తెలిపింది. సినీ ఇండస్ట్రీని తిరిగి గాడిలో పెట్టేందుకు ఏం చేయాలన్నది త్వరలోనే చర్చిస్తామని చెప్పింది. ఈ క్రమంలో 24 క్రాప్ట్స్‌తోనూ చర్చలు జరుపుతామని తెలిపింది. సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో హీరోల రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని నిర్మాతలు కోరుతున్నారు. కేవలం హీరో రెమ్యూనరేషన్ లే కాక మేనేజర్లు, కోఆర్డినేటర్ల వ్యవస్థ కూడా పూర్తిగా రూపు మాపే విధంగా ప్రణాళికల సిద్ధం చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఇతర భాషల సినిమాలకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు.