టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూశారు. గత కొంతకాలంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆయన పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో శరత్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
తెలుగులో ఆయన దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 'డియర్' అనే నవల ఆధారంగా 'చాదస్తపు మొగుడు' అనే చిత్రంతో పరిశ్రమలో అడుగుపెట్టారు. బాలకృష్ణ, సుమన్‌లతో ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాడు. బాలకృష్ణతో `వంశాని కొక్కడు', 'పెద్దన్నయ్య', 'సుల్తాన్', 'వంశోద్ధారకుడు` , సుమన్ తో `చాదస్తపు మొగుడు', 'పెద్దింటి అల్లు డు', 'బావ-బావమరిది', 'చిన్నల్లుడు', ఏఎన్నార్‌తో 'కాలేజీ బుల్లోడు', జగపతిబాబుతో 'భలే బుల్లోడు' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయా చిత్రాలు దర్శకుడిగా శరత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కాగా.. శరత్ పెళ్లి చేసుకోలేదు.