ప్రముఖ నటుడు శరత్‌బాబు ఆరోగ్యం విషమం
ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు ఆరోగ్యం క్షీణించింది. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో
By అంజి Published on 23 April 2023 12:00 PM ISTప్రముఖ నటుడు శరత్‌బాబు ఆరోగ్యం విషమం
ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు ఆరోగ్యం క్షీణించింది. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ నెల 20వ తేదీన హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చేర్పించారు. గత మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శరత్‌బాబు ఆరోగ్యం క్షీణించిందని సమాచారం. శరీరం విషతుల్యమైందని, దాని ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, ఇతర ఆర్గాన్స్‌పై పడిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై శరత్‌బాబుకు చికిత్స కొనసాగుతోంది.
సినీ ప్రేక్షకులు, ప్రముఖులు శరత్ బాబు త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు. శరత్ బాబు 1973లో తెలుగు సినిమా ‘రామరాజ్యం’ తో వెండితెరకు పరిచయం అయ్యారు. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో 200 పైగా సినిమాల్లో నటించారు. ‘మూడు ముళ్ల బంధం’, ‘సీతాకోక చిలుక’, ‘సంసారం ఒక చదరంగం’, ‘అన్నయ్య’, ‘ఆపద్భాందవుడు’, ‘సాగర సంగమం’, ‘బొబ్బిలి సింహం’, ‘శివరామ రాజు’ వంటి చిత్రాల్లో ఆయన మంచి పాత్రలు పోషించారు.హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆడియన్స్ ని అలరించాడు. తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో నటించారు.