'మిస్టర్ బచ్చన్' బిజినెస్ మస్త్ గా సాగుతోంది!!

హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ చిత్రం అజయ్ దేవగన్ నటించిన హిందీ హిట్ చిత్రం రైడ్‌కి అధికారిక రీమేక్.

By అంజి  Published on  24 July 2024 1:15 PM IST
Tollywood, Mr. Bachchan, movie, theatrical business

'మిస్టర్ బచ్చన్' బిజినెస్ మస్త్ గా సాగుతోంది!! 

హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ చిత్రం అజయ్ దేవగన్ నటించిన హిందీ హిట్ చిత్రం రైడ్‌కి అధికారిక రీమేక్. మిరపకాయ్‌తో బ్లాక్‌బస్టర్‌ సాధించిన హరీష్‌ శంకర్‌, రవితేజ కాంబినేషన్‌ లో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ బాగా సాగుతున్నాయి.. సినిమాకు మంచి బజ్‌ ఉంది. ఇక మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. సినిమాలోని మొదటి సింగిల్ సితార్ సాంగ్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. రెండవ సింగిల్, రెప్పల్ డప్పుల్ ఈ వారం జూలై 25న కూడా విడుదల కానుంది.

ఆగస్టు 15న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రా బిజినెస్ 18 కోట్లు, మొత్తం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 35 కోట్లు, మిగిలిన వరల్డ్ రైట్స్ దాదాపు 7 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. థియేట్రికల్ బిజినెస్ 40 కోట్ల రేంజ్‌లో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ రూపంలో మిస్టర్ బచ్చన్‌కు గట్టి పోటీ ఎదురవుతుంది. బ్లాక్ బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే పాటలు, టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండు సినిమాలు హిట్ అవ్వాలని తెలుగు మూవీ లవర్స్ కోరుకుంటూ ఉన్నారు.

Next Story