త్వరలోనే సినిమా షూటింగ్‌లు పునః ప్రారంభం
Tollywood movie shootings will be starts soon. సినీ ఇండస్ట్రీలో పలు సమస్యల కారణంగా.. కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి.
By అంజి Published on 18 Aug 2022 8:00 PM ISTసినీ ఇండస్ట్రీలో పలు సమస్యల కారణంగా.. కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. ఈ నెల 1వ తేదీన ఆగిన సినిమా చిత్రీకరణలు ఇప్పటి వరకు తిరగి ప్రారాంభం కాలేదు. ఎప్పుడు షూటింగ్‌లు తిరిగి ప్రారంభం అవుతాయో కూడా క్లారిటీ లేదు. అయితే తాజాగా ఫిలిం ఛాంబర్ సభ్యులు సీని పరిశ్రమ సమస్యలపై చర్చలు జరిపారు. చర్చల అనంతరం ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడాడు. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధరపై చర్చించినట్లు తెలిపాడు.
ప్రేక్షకులకు ధరలు అందుబాటులో ఉండే విధంగా చర్చించామని తెలిపారు. సింగిల్ స్క్రీన్ టిక్కెట్స్ ధరలపై రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు. షూటింగ్‌లను కూడా త్వరలోనే మొదలు పెడతామని, అంతేకాకుండా 'ఇక నుండి విడుదలయ్యే ప్రతి సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని వెల్లడించాడు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరుపలేదన్నారు. సినిమా నిర్మాణ వ్యయాలపై మరో రెండు మూడు రోజుల్లో చర్చించి త్వరలోనే ప్రకటన చేస్తామని దిల్‌రాజు తెలిపాడు.
ఫిలిం చాంబర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)తో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఫిలిం ఫెడరేషన్ తో ఉన్న సమస్యలు పరిష్కరించు కుంటున్నామని అన్నారు. త్వరలోనే సినిమా షూటింగులు మొదలు పెడతామని దిల్ రాజు పేర్కొన్నారు. బాలీవుడ్ కూడా మన సినీ ఇండస్ట్రీని గమనిస్తోందని వెల్లడించారు. టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారని వివరించారు. దక్షిణాదిలోని ఇతర చిత్ర పరిశ్రమలు కూడా మన నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నాయని దిల్ రాజు తెలిపారు.