టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి ఇంట్లో విషాదం
టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 11:19 AM ISTటాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి ఇంట్లో విషాదం
టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వేణు తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు (92) కన్నుమూశారు. వృద్ధ్యాప్ప సంబంధిత సమస్యలతో తెల్లవారుజామున ఆయన ప్రాణాలు విడిచారు. ఇక తండ్రి మరణంతో వేణు ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. వెంకట సుబ్బారావు భౌతిక కాయాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ కాలనీలోని సట్ఈల్ అండ్మైన్స్ కాంప్లెక్స్ నందు సందర్శనార్థం ఉంచుతారు. కాగా.. సుబ్బారావు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
సోమవారం రోజే సుబ్బారావు తొట్టెంపూడి అంత్యక్రియలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వేణు 'స్వయంవరం' 1990లో సినిమాతో సినిమా కెరియర్‌ను ప్రారంభించారు. 2013లో 'రామాచారి' సినిమా తర్వాత సినీపరిశ్రమకు కొంతకాలం దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఇటీవల వచ్చిన రవితేజ సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో మరోసారి ఎంట్రీ ఇచ్చారు. అతిథి అనే వెబ్‌సిరీస్‌లో కూడా ప్రధాన పాత్రలో కనింపించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో వేణు వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నారు. వేణు తొట్టెంపూడి టాలీవుడ్‌లో కామెడీ, ఫ్యామిలీ, ప్రేమకథా చిత్రాలతో సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను అలరించారు.