సుధీర్‌ బాబు కొత్త సినిమా టైటిల్‌ రిలీజ్‌

ప్రస్తుతం సుధీర్‌ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఓ సినిమాను యూవీ సంస్థ తెరకెక్కిస్తోంది.

By అంజి  Published on  18 Jun 2023 2:02 PM IST
Tollywood, Hero Sudhir Babu, new movie, Ma nanna Super Hero

సుధీర్‌ బాబు కొత్త సినిమా టైటిల్‌ రిలీజ్‌

ఎంతో డెటికేట్‌గా సినిమాలు చేసే వారిలో టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు ఒకరు. అయితే ఆయన కెరీర్‌లో ఓ సినిమా హిట్టైతే.. మరో రెండు సినిమాలు ప్లాఫ్‌ అవుతున్నాయి. మహేష్‌ బాబు సపోర్ట్‌, పవర్‌ ప్యాక్డ్‌ బాడీ, టాలెంట్‌ ఉన్న సుధీర్‌ బాబు.. కమర్షియల్‌ హీరోగా మాత్రం సక్సెస్‌ కాలేకపోతున్నాడు. కెరీర్‌ మొదటి నుంచి డిఫరెంట్‌ సినిమాలు చేస్తున్నాడు. అయినా సుధీర్‌బాబుకు సరైన గుర్తింపు రావడం లేదు. 'సమ్మోహనం' మూవీతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న సుధీర్‌.. ఆ తర్వాత కూడా ప్రేక్షకులను మెప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పట్టాయి. ఇటీవల కాలంలో వచ్చిన 'హంట్‌', 'మామ మశ్చీంద్ర' సినిమాలు కూడా బాక్సాఫీసును షేక్‌ చేయలేకపోయాయి. దీంతో ఇప్పుడు మంచి కంబ్యాక్‌ సినిమా కోసం సుధీర్‌ బాబు ఎంతోగానో పరితపిస్తున్నాడు.

ప్రస్తుతం సుధీర్‌ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఓ సినిమాను యూవీ సంస్థ తెరకెక్కిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ పోస్టర్స్‌ మేకర్స్ విడుదల చేశారు. ఈ రోజు వరల్డ్ ఫాదర్స్ డే కావడంతో 'మా నాన్న సూపర్ హీరో' అనే టైటిల్‌తో స్పెషల్ అండ్ ఎమోషనల్ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు. అభిలాష్‌ కంకర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. తాజాగా రిలీజైన టైటిల్‌ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో కేరళ స్టేట్ లాటరీ అంటూ కోటి రూపాయలు లాటరీని ఒకరు గెలుచుకున్నట్లు ఓ ఫ్లెక్స్‌ను పెట్టారు. ఇది సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్‌ చేస్తోంది. జై క్రిష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను కామ్ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నాడు.

Next Story