NANI 31: 'సరిపోదా శనివారం' టైటిల్‌ పోస్టర్‌.. అదిరిందిగా..

హీరో నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు 'సరిపోదా శనివారం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

By అంజి  Published on  23 Oct 2023 1:06 PM IST
Tollywood, Nani, saripodhaa sanivaaram, DVV

NANI 31: 'సరిపోదా శనివారం' టైటిల్‌ పోస్టర్‌.. అదిరిందిగా..

హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా రాబోతోంది. ఈసారి దర్శకుడు నాని కోసం ఒక నవల సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది. ఈ సినిమా గురించి ఆకట్టుకునే ప్రకటన చేసిన తర్వాత, మేకర్స్ దసరా పండుగ రోజు బిగ్‌ అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. #Nani31 సినిమాకు 'సరిపోదా శనివారం' టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్‌ పోస్టర్‌, గ్లింప్స్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. పోస్టర్ లో నాని చేతికి సంకెళ్లు, భీకరమైన అరుపుతో ఉన్న ఫస్ట్ లుక్ అదిరిపోయింది. పోస్టర్ను క్లోజ్‌గా గమనిస్తే.. నాని బంధించబదినట్టుగా లేదు.. సంకెళ్లు తెంచుకుని జయించటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

గ్లింప్స్‌ వీడియో సాయి కుమార్ వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమవుతుంది. గాయపడిన నాని గొలుసుతో కట్టి, విడిపించుకోవడానికి గొలుసు విప్పాడు. నాని వీర ప్రవేశం తర్వాత, అతని ప్రజల నుండి అతనికి ఘన స్వాగతం లభిస్తుంది. టైటిల్ గ్లింప్స్లో.. ''మన పెద్దలు ఒక మాట అనేవారు..రాజుకైనా, బంటుకైనా, ఎలాంటి వాడికైనా ఓ రోజు వస్తోంది..ఇపుడు కొత్త తరం వాళ్ళు మాత్రం.. నీకంటూ ఒక టైం వస్తుంది అంటారు. కానీ ఏ తరం వాళ్ళైకైనా.. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేది..ఆ ఒక్క రోజు గురుంచే. అది ఒకడికి వారానికి ఓ రోజు వస్తే..వాడ్ని ఎవడైనా ఆపగలడా? అనుకున్నా ఆపగలరా.. అదే శనివారం.. ప్రతి శనివారం.. సరిపోదంటారా'' డైలాగ్ వీర లెవల్లో ఉంది.

సరిపోదా శనివారం అనేది ఒక విచిత్రమైన, ఇంకా ఆకట్టుకునే టైటిల్. ఇంతకుముందు చిన్న చిన్న ఆలోచనలతో ప్రత్యేకమైన స్క్రిప్ట్‌లను రూపొందించిన వివేక్ ఆత్రేయ భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు గ్రాండ్ ఓపెనింగ్ జరుపుకోనున్న ఈ పాన్ ఇండియా మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్ జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మూవీకి జేక్స్ బేజోయ్ సంగీతం అందిస్తున్నారు.

Next Story