టీమిండియా హెడ్‌ కోచ్ పదవికి టాలీవుడ్ హీరో దరఖాస్తు!

టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్ పదవి కాలం కొద్ది రోజుల్లో ముగియనుంది.

By Srikanth Gundamalla  Published on  16 May 2024 12:51 PM IST
tollywood hero,  team india, cricket, head coach, bcci,

టీమిండియా హెడ్‌ కోచ్ పదవికి టాలీవుడ్ హీరో దరఖాస్తు!

త్వరలోనే టీ20 వరల్డ్‌ కప్‌ మెగా టోర్నీ జరగనుంది. అయితే.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత టీమిండియాకు కొత్త కోచ్‌ రానున్నారు. ఇప్పటికే కొత్త కోచ్‌ ఎంపిక ప్రక్రియను బీసీసీఐ మొదలు పెట్టింది. హెడ్‌ కోచ్‌ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే హెడ్‌ కోచ్‌ దరఖాస్తుల ప్రక్రియలో ఆసక్తికర పరిణామం జరిగింది.

ప్రస్తుతం టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్ పదవి కాలం కొద్ది రోజుల్లో ముగియనుంది. ఆయన స్థానంలోనే కొత్త కోచ్‌ను తీసుకోనుంది బీసీసీఐ. ఇందు కోసం అప్లికేషన్లను తీసుకుంటుంది. దరఖాస్తులను ఓపెన్‌ గూగుల్‌ ఫార్మ్స్‌లో అందుబాటులో ఉంచింది. ఇదే అదునుగా భావించిన చాలా మంది నెటిజన్లు సరదాగా భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ స్క్రీన్‌ షాట్స్‌ను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తూ లైక్స్ అందుకుంటున్నారు.

ఈ క్రమంలోనే టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవికి సరదాగా టాలీవుడ్‌ హీరో ఒకరు దరఖాస్తు చేసుకున్నాడు. దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ అప్లికేషన్‌ పెట్టుకున్నాడు. తాను అప్లై చేసిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. తను చేసిన దరఖాస్తును బీసీసీఐ రిజెక్ట్‌ చేసిందనే విషయాన్నికూడా రాహుల్‌ చెప్పాడు. టీమిండియా హెడ్‌ కోచ్‌ దరఖాస్తును నింపడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టిన అతను.. 'మీకు తెలుసా.. నేను ఒకేసారి టీమ్‌ ఇండియాకు హెడ్‌ కోచ్‌ కావాలని అనుకున్నాని అని ఏదో ఒకరోజు తన పిల్లలకు చెప్పాలని అనుకున్నానని' ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చాడు.

కాగా.. అందాల రాక్షసి సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ హీరో. రాహుల్‌ రవీంద్రన్‌ కొన్నాళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. చివరగా వెన్నెల కిశోర్ నటించిన చారి 111 సినిమాలో నటించాడు. ప్రస్తుతం రాహుల్‌ దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం గర్ల్‌ ఫ్రెండ్‌. ఈ మూవీలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది.


Next Story