ప్రముఖ దర్శకుడు మారుతికి పితృవియోగం
Tollywood Director Maruthi Father Passed away.ప్రముఖ దర్శకుడు మారుతి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన
By తోట వంశీ కుమార్ Published on 21 April 2022 8:19 AM ISTప్రముఖ దర్శకుడు మారుతి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కుచలరావు కన్నుమూశారు. మచిలీపట్నంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. కుచలరావు మరణంతో మారుతి ఇంట విషాదం అలుముకుంది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, బంధుమిత్రులు మారుతికి ఫోన్ చేసి సంతాపం తెలుపుతున్నారు. కుచలరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. డిస్ట్రిబ్యూటర్‌గా, యాడ్స్ డిజైనర్‌గా పని చేసిన మారుతి 'ఈ రోజుల్లో' చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ తరువాత 'బస్ స్టాప్' సినిమాని తెరకెక్కించాడు. ఈ రెండు చిన్న చిత్రాలుగా విడుదలై ఘన విజయాలు సాధించాయి. దీంతో మారుతి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తరువాత ' ప్రేమకథా చిత్రం', 'కొత్తజంట', 'బాబు బంగారం', 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'శైలజారెడ్డి అల్లుడు', 'ప్రతిరోజు పండగే' వంటి చిత్రాలను తెరకెక్కించాడు.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'మంచి రోజులు వచ్చాయి' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' అనే చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'పక్కా కమర్షియల్' చిత్రం తరువాత ప్రభాస్‌తో ఓ చిత్రం చేయనున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక టాలీవుడ్లో గత రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత నారంగ్, సీనియర్ దర్శకుడు తాతినేని స్వర్గస్తులు అయ్యారు.