ప్ర‌ముఖ క‌మెడియ‌న్ రఘు ఇంట తీవ్ర విషాదం

Tollywood Comedian Raghu Father passed away.ప్ర‌ముఖ టాలీవుడ్ క‌మెడియ‌న్ ర‌ఘు ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2022 6:20 AM IST
ప్ర‌ముఖ క‌మెడియ‌న్ రఘు ఇంట తీవ్ర విషాదం

ప్ర‌ముఖ టాలీవుడ్ క‌మెడియ‌న్ ర‌ఘు ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి కారుమంచి వెంకట్రావ్ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వెంకట్రావ్ ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 74 సంవ‌త్స‌రాలు. 1947 జూన్ 10న వెంక‌ట్రావ్ జ‌న్మించారు. ఆర్మీ అధికారిగా సేవ‌లందించారు. రిటైర్ అయిన త‌రువాత ఇంటి వ‌ద్ద‌నే ఉంటున్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల స్నేహితులు, ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

రఘు విషయానికి వస్తే.. 'ఆది' చిత్రంతో న‌టుడిగా తెర‌గ్రేటం చేశారు. 'అదుర్స్' సినిమాలో త‌న కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు 150 పైగా సినిమాల్లో న‌టించారు. బుల్లితెర‌పై జబర్దస్త్ కామెడీ షోతో మంచి పాపులర్ అయ్యారు. ఆ షోలో రోలర్ రఘు అనే టీమ్‌కు రఘు లీడర్‌గా ఉంటూ కొన్నాళ్లు కొనసాగారు. జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన రఘు అవకాశాలు తగ్గిపోవడంతో సొంతూరు వెళ్లి వ్యవసాయం, లిక్కర్ బిజినెస్ చేసుకుంటూ సెటిల్ అయిపోయాడు.

Next Story