ర‌మేష్‌బాబు మృతి ప‌ట్ల సినీ ప్ర‌ముఖుల నివాళి

Tollywood celebs mourn untimely demise of Mahesh Babu's elder brother Ramesh Babu.టాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు సూప‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jan 2022 4:47 AM GMT
ర‌మేష్‌బాబు మృతి ప‌ట్ల సినీ ప్ర‌ముఖుల నివాళి

టాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు సూప‌ర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మ‌హేష్‌బాబు సోద‌రుడు ఘ‌ట్ట‌మ‌నేని ర‌మేష్ బాబు నిన్న రాత్రి క‌న్నుమూశారు. ర‌మేష్‌బాబు అకాల మ‌ర‌ణం టాలీవుడ్‌తో పాటు వారి కుటుంబంలో తీర‌ని విషాదాన్ని నింపింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌మేష్‌బాబు మృతి ప‌ట్ల టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

'శ్రీ ఘట్టమనేని రమేష్ బాబు ఆకస్మిక మరణ వార్త విని షాక్ అయ్యి ఎంతో బాధ పడ్డాను. శ్రీ కృష్ణ గారు, మహేష్ మరియు వారి కుటుంబం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ హృదయ విదారక నష్టాన్ని తట్టుకునే విధంగా ఆ భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

ర‌మేష్‌బాబు మృతి ప‌ట్ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌న్నారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు. కృష్ణ న‌టవార‌సుడిగా చిత్ర నిర్మార‌ణంలో ర‌మేష్‌బాబు విజ‌యాలు సాధించార‌న్నారు. ర‌మేష్‌బాబు కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ఇవ్వాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు.

'రమేష్‌బాబు మృతిపట్ల ఆయన కుటుంబానికి నా ప్రగాడ సానభూతి. రమేష్‌బాబు మృతి కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా'- దర్శకుడు మెహర్‌ రమేశ్‌

'రమేష్‌బాబు అకాల మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. రమేష్ బాబు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు'- హీరో నితిన్‌

ఇక టాలీవుడ్ దర్శకులు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ కూడా కృష్ణ కుటుంబానికి విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.


Next Story
Share it