అక్కా సినిమా హిట్‌.. నన్ను నమ్ము.. వాట్సాప్‌ చాట్‌ బయటపెట్టిన పూనమ్‌ కౌర్‌

Tollywood‌ Actress Poonam Kaur latest post creates curiosity. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా 'భీమ్లా నాయక్‌' ఇవాళ థియేటర్లలో విడుదలై రచ్చ లేపుతోంది. థియేటర్ల దగ్గర పవన్‌ క

By అంజి  Published on  25 Feb 2022 3:26 PM IST
అక్కా సినిమా హిట్‌.. నన్ను నమ్ము.. వాట్సాప్‌ చాట్‌ బయటపెట్టిన పూనమ్‌ కౌర్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా 'భీమ్లా నాయక్‌' ఇవాళ థియేటర్లలో విడుదలై రచ్చ లేపుతోంది. థియేటర్ల దగ్గర పవన్‌ కల్యాణ్‌ అభిమానుల జాతర సాగుతోంది. పవన్‌ సినిమాపై ఇవాళ ఉదయం నుండి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. రివ్యూలు సైతం పవన్‌ సినిమాకు అనుకూలంగా వచ్చాయి. బొమ్మ హిట్టు, సినిమా దద్దరిల్లింది అని కామెంట్లు వినబడుతున్నాయి. అయితే టాలీవుడ్‌ నటి పూనమ్‌ కౌర్‌.. భీమ్లా నాయక్‌ సినిమాపై చేసిన తన తాజా ట్వీట్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ వాట్సాప్‌ చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను పూనమ్‌ కౌర్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది.

వాట్సాప్‌ చాట్‌లో ఇలా ఉంది.. '' ఓ వ్యక్తి తన వాట్సాప్‌ స్టేటస్‌లో 'భీమ్లా నాయక్‌' సినిమాకు సంబంధించి స్టేటస్‌ పెట్టుకోగా.. దానికి ఏమిటి అంటూ ఇంకో వ్యక్తి రిప్లయ్‌ ఇచ్చారు. దానికి సినిమాకి వచ్చిన అక్కా.. బావ సినిమా.. మార్నింగ్‌ 8 గంటలకు.. స్టార్ ఎమోజీలను ఆ వ్యక్తి రిప్లైగా ఇచ్చారు. దానికి సిగ్గుపడుతున్న ఎమోజీలను పెట్టి, నిజాయితీ రివ్యూ చెప్పాలని అడుగుతారు. ఒకే అక్కా అంటూ అవతలి వ్యక్తి రిప్లయ్‌ ఇస్తారు. అక్కా సినిమా హిట్.. ట్రస్ట్ మీ.. ప్రామీస్ చెబుతున్నా అని ఆ వ్యక్తి రిప్లై ఇస్తారు.'' దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను పూనమ్‌ కౌర్‌ షేర్‌ చేయడంతో.. ఆ ట్వీట్‌ ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు పూనమ్‌ కౌర్‌ మీద సెటైర్లు వేస్తున్నారు.

Next Story