డ్ర‌గ్స్‌కేసులో ప‌ట్టుబ‌డ్డ టాలీవుడ్ న‌టి.. ఆ హీరోయిన్ ఎవ‌రంటే..?

Tollywood Actress arrested in Drugs Case.సినీ పరిశ్రమలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ మాఫియా రన్ అవుతోంది.డ్ర‌గ్స్‌కేసులో ప‌ట్టుబ‌డ్డ టాలీవుడ్ న‌టి..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jan 2021 7:56 AM GMT
drug case

సినీ పరిశ్రమలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ మాఫియా రన్ అవుతోంది. పోలీసులు రైడ్ చేసినప్పుడే ఇలాంటి మాఫియాలు బయటపడుతున్నాయి. సుశాంత్‌సింగ్ కేసులో భాగంగా బ‌య‌ట‌ప‌డ్డ డ్ర‌గ్స్ కేసు మొన్న‌టి వ‌ర‌కు బాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. అది ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ముంబ‌యిలోని ఒక ప్ర‌ముఖ హోట‌ల్‌లో డ్ర‌గ్స్ దందా నిర్వ‌హిస్తున్న‌ట్లుగా స‌మాచారం అంద‌డంతో ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న చాంద్ మ‌హ‌మ్మ‌ద్‌తో పాటు ఓ టాలీవుడ్ న‌టిని అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుంచి 400 గ్రాముల మెఫెడ్రోన్‌ను స్వాదీనం చేసుకున్నారు. దీని విలువు సుమారు రూ.8 నుంచి 10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసే స‌య్య‌ద్ ప‌రారీలో ఉన్న‌ట్లు ఎన్‌సీబీ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

అయితే.. ప‌ట్టుబ‌డ్డ ఆ టాలీవుడ్ న‌టి ఎవ‌ర‌న్న‌ది తెలియాల్సి ఉంది. మరి ఆమె నటించిన సినిమాలు ఏంటి..? అసలు ఆమె ఎవ‌రు..? అన్న‌ది ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టాలీవుడ్ నటి శ్వేతాకుమారిగా అనుమానిస్తున్నారు. పోలీసులు ఆ యువనటిని కోర్టులో హాజరు పరచనున్నారట. చూడాలి మరి డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఆ నాలుగు సినిమాల హీరోయిన్ ఎవరినేది..?

సుశాంగ్‌సింగ్ రాజ్‌పుత్ మృతి వ్య‌వ‌హారంలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హార‌మే కీల‌కంగా మారింది. ఈ కేసులో ఇప్ప‌టికే ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను ఎన్‌సీబీ విచారించింది. ఈ క్ర‌మంలో సుశాంత్‌సింగ్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె సోద‌రుడు షోయిక్ చ‌క్ర‌వ‌ర్తిని అదుపులోకి తీసుకోగా.. కోర్టు బెయిల్ ఇవ్వ‌డంతో వారు బ‌య‌టికి వ‌చ్చారు.


Next Story