కాలి నడకన తిరుపతి కొండెక్కిన నితిన్
Tollywood Actor Nithin climbed the Tirupati hill on foot. కాలి నడకన తిరుపతి కొండెక్కిన నితిన్.
By తోట వంశీ కుమార్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇటీవల ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. నిజానికి లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లోనే పెళ్లి జరగాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా మూడు నెలల ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది సమక్షంలోనే నితిన్ పెళ్లి జరిగిపోయింది. తాజాగా ఈ యంగ్ హీరో కాలినడకన ఏడుకొండలు ఎక్కుతూ ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భార్య షాలినితో కలిసి తిరుమల చేరుకున్న నితిన్ కాలినడకన కొండెక్కారు.
నితిన్ దంపతులిద్దరూ బుధవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతి వెళ్లారు. నితిన్ లాంటి హీరో కాలినడకన కొండెక్కడంతో అక్కడనున్న వారంతా షాక్‌కు గురయ్యారు. మొత్తం 2గంటల 20 నిమిషాల్లో నితిన్ తిరుమల మెట్లెక్కి స్వామివారిని దర్శించుకున్నాడట. ఆ సమయంలో అభిమానులు నితిన్ తో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ఈ విషయాన్ని నితిన్.. తన ఇన్ స్టా అకౌంట్ లో తెలియజేస్తూ ఫోటో కూడా జతచేశాడు. ట్విట్టర్ లో ఇందుకు సంబంధించిన వీడియోను ఉంచాడు. '2గంట 20 నిమిషాల్లో తిరుమల కొండెక్కడం విజయవంతం గా పూర్తయ్యింది.. ఓం నమో వెంకటేశాయ' అంటూ పోస్ట్ చేశాడు నితిన్.
Om Namoo Venkateshayaa 🙏🙏 https://t.co/s3MC21NXsb
— nithiin (@actor_nithiin) January 6, 2021
కొండపై నితిన్‌ను గుర్తించిన కొందరు అభిమానులు ఆయనతో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. నితిన్ వేగంగా నడుచుకుంటూ వెళ్తుండగానే.. అభిమానులు ముందుకు వెళ్లి సెల్‌ఫోన్లలో సెల్ఫీలు దిగారు. అయితే ఆయనకు దగ్గరగా రాకుండా దూరంగానే ఉంటూ సెల్ఫీలు దిగడంతో ఆయన ఏమీ అనకుండా ముందుకు సాగారు. కొందరు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించినా.. కరోనా నిబంధనలను గుర్తు చేసి దూరంగా ఉండాలని నితిన్ సూచించారు. లాస్ట్ ఇయర్ భీష్మ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నితిన్ ప్రస్తుతం రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. మార్చి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కాకుండా 'చెక్' అనే సినిమాలో నటిస్తున్నాడు.