తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లలో పాప్ కార్న్, కూల్‌డ్రింక్స్, స్నాక్స్ ధరలపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ సినిమా థియేటర్లలో అధిక ధరలకు అమ్మే టికెట్లు, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ ధరలను తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ ఇలా రాసుకొచ్చారు. టిక్కెట్ ధరలపై ఒక పరిమితి విధించాలి. స్నాక్స్ పేరుతో అధిక ధరలు వసూలు చేయడం సరికాదు.
"ఇటీవల నేను సినిమా చూశాను, సినిమా కంటే స్నాక్స్ ధరలే ఎక్కువయ్యాయి. ఇది పెద్ద సమస్య, దీనిని పరిష్కరించాలని నేను డిస్ట్రిబ్యూషన్ సర్కిల్‌లను కోరుతున్నాను." అని అన్నారు. అలాగే, అధిక టిక్కెట్ ధరలకు పరిమితి విధించాలని, కానీ స్నాక్స్ విషయంలో విచ్చలవిడి ధరలు వసూలు చేయడం సరికాదని, ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.