నేడు సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ
Today Megastar Chiranjeevi going to meet CM Jagan.సీఎం జగన్‌ను మెగాస్టార్ చిరంజీవి గురువారం కలవనున్నారు.
By తోట వంశీ కుమార్
సీఎం జగన్‌ను మెగాస్టార్ చిరంజీవి గురువారం కలవనున్నారు. మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వీరు భేటి కానున్నారు. భోజన విరామ సమయంలో చిరును కలిసేందుకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలు ఈ భేటిలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై సినీపరిశ్రమకు మంత్రులకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా మొన్న సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. కానీ ఆ భేటీలో ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ క్రమంలో సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటి కానుండడం సర్వతా ప్రాధాన్యత సంతరించుకుంది.
సినిమా టికెట్ల వివాదంపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వివాదం ముదురుతుండడంతో చిరు దీనికి పుల్‌స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి పరిస్థితిని వివరించనున్నారట. అంతేకాకుండా చిత్ర పరిశ్రమపై పలువురు నాయకులు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా సీఎం జగన్ దృష్టికి మెగాస్టార్ తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చిరంజీవి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకొని సీఎం జగన్‌తో భేటీ కానున్నారు.