గాడ్ ఆఫ్ మ్యూజిక్ 'ఇళయరాజా'
ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు, సినిమా ప్రేమికులుండరు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన
By అంజి Published on 2 Jun 2023 8:30 AM ISTగాడ్ ఆఫ్ మ్యూజిక్ 'ఇళయరాజా'
ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు, సినిమా ప్రేమికులుండరు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని. చిత్ర పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు 'ఇళయరాజా'. తమిళనాడులోని తేని జిల్లా, పన్నైపురమ్ గ్రామంలో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు జూన్ 2, 1943న జన్మించారు ఈ మేస్ట్రో.
ఈ లెజెండ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆయన పాట వినిపిస్తే.. మూడ్ చేంజ్ అయిపోతుంది. ఆయన సంగీతం సమకూర్చిన చిత్రాలతోనే ఎంతోమంది స్టార్స్‌గా వెలిగారు. అందుకే ఇళయరాజాను స్టార్ ఆఫ్ స్టార్స్, కింగ్ ఆఫ్ మెలోడీ, మేస్ట్రో, ఇసై జ్ఞాని అంటుంటారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లోకి వెయ్యికిపైగా సినిమాల్లో 5 వేలకు పైగా పాటలకు బాణీలందించారు.
తమిళనాట పుట్టినా.. తెలుగువారిని ఇళయరాజా స్వరకల్పన అలరించిన తీరు అనితరసాధ్యం అనే చెప్పాలి. 'భద్రకాళి' మొదలు 'శ్రీరామరాజ్యం' వరకు ఇళయరాజా తెలుగువారిని ఆకట్టుకునే స్వరాలు పలికించారు. చిరంజీవికి అనేక మ్యూజికల్ హిట్స్ అందించి సక్సెట్ రూట్ చూపించారు. మూడు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా అవార్డులు పొందారు. సాగర సంగమం, సీతాకోక చిలుక, రుద్రవీణ, జెంటిల్‌మేన్, కిల్లర్, అభినందన, ఛాలెంజ్, ఘర్షణ వంటి ఎన్నో మరిచిపోలేని సినిమాలకు సంగీతం ద్వారా ప్రాణం పోశారు ఇళయరాజా.